పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాంక ము

15


       
        లేదు. ఈశరీరంబునకు మరణంబు నైసర్గిక ధర్మంబు. ఇదివఱికే
        నిరంతరతపఁబుచే, శుష్కించి, శుష్కించి, శల్యావశిష్టంబుగ
        నున్నది. ఈ యెముకలప్రోవుపై శ్రీరాముఁడు విశ్వామిత్ర దత్త
        మైన ధనుష్పాండిత్యము మెఱయ నస్రప్రయోగముఁ గావించి
        కీర్తి ని బొందినఁ బొందు గాక, శిష్యుని లక్ష్యజ్ఞానమునకు విశ్వా
        మిత్రుడు సంతసించిన, సంతసించుఁ గాక, కుమారా ! యింకొ
        క్కటి విచారింపుము.

          సీ. ఇల్వల వాతాపు • లిద్దరు పల్వుర
                మనుజుల దిగమ్రింగి • రనుటయేల !
          కుంభకర్ణాదులు, గుటగుట రక్తంబుఁ
                దెగ ద్రావిరని చెప్పి • తెగడు టేల ?
         చేతికందినయట్టి' జీవరాసుల కబం
              ధుఁడు చంపె నంచును, నుడువు టేల?
         మత్తిల్లి తారక • మనుజాళి పల్వుర
             భక్షించెనని చెప్పి, • బదరు టేల?

          సూర్యవంశోద్భవుం డతి శూరవరుఁడు
          వివర మెఱిగిన మనుజుండు. బికిర మెత్తి
          కొనుచు జీవించునొక కృశాంగునిన లౌకి
          కుని నిరపరాధు దయమాలి. గొంతుగోయ ..........10

అం:-- అమంగళము ప్రతిహతమగుఁగాక.

శం: ఇందమంగళ మేమున్నది! జరుగవలసిన కార్యవిధానమే యిది.

అం:-అయ్యా ! యీవృధామరణమువలన లాభ మేమున్నది ?

శం:-ఏమున్నదా ! శ్రీరాముఁడు ఖడ్గహస్తుఁడై చనుదెంచి, నన్నీ
      జపతపంబులుమాని ద్విజ సేవచేయుమన్నను నాయంతరాత్మకు వ్య