ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii


లను బట్ణణములు కాని, పల్లెలు కాని, మొట్టమొదట లేవు. నేఁటికవి, చెంచు మొదలగు జాతుల వలెనే చింత తోపుల యందునో, యేచెట్టుల మధ్యనో, తాత్కా లిక కుటీర్ములయందు నివసించుచుండిరి. వీరు సనాతులు. చీమలు దూరని చిట్టడవి యైనను, కాకులు దూరని కారడవియైనను, మూలముట్టుగ. వీరికవగతము. అడవుల యందున్న దొంగ దారులను, సందు గొందులను , వీరు బాగుగా నెఱుంగుదురు. అటవీ రాజ్యమే వీరి రాజ్యము ; అడపులు కూడ వీరి నామముల చేతనే పిలువం బడుచుండునవి. ఆటవీ రహస్యజ్నాన మార్యులకు లేకపోవుట చేత రాత్రులడవులు బాగుగ నెంరింగిన ద్రావుడులకు మిగుల భయపడు చుండువారు.. రాక్షసులకు రాత్రులందు బల మెక్కవని చెప్పు పురాణాదుల వాక్యములకుఁ గారణ మిదియే. వీరికి వైవాహిక నిబందన లేవియు, లేవని చెప్పవచ్చును. అన్న భార్యను డమ్ముఁడుంచు కొనటయుఁ దమ్ముని భార్యను నన్న యుంచుకొనుటయు: దోషము కావయ్యె. సోదరీ సంపర్కము కూడ హేయముగాఁ కనంపఁబడి నట్టు కనంపడుట లేదు. ఈజిప్టు దేశమునందుఁ జిరకాలము క్రిందట రాజవంశమునకు సౌకర్యము కల్గునని చెప్పి యేక గర్భజాతులే పెండ్లియాడు చుండిరి. బోర్నియో దేశమునం దిప్పటికిని నేక గర్భ జాతులు కాకపోయి నప్పటికిని నక్కసెల్లెండ్ర బిడ్డలకును నన్న దమ్ముల బిడ్డలకును వివాహములు కలవు. రషియా దేశపు చక్రవర్తి కుటుంబమునఁ దఱచిట్టి యువ్విహములు జరుగుచుండెడివి. వర్తమాన కాలంబున మహమ్మదీయుల యందును, క్రైస్తవుల యందును నిట్టి పెండ్లిండున్నవి. ఎక్కడికో పోవు టేల ? మనకు నేపమును బుట్టించు కొన్ని విధ ములగు పెండ్లిడ్లు శుద్ధ ద్రావిడ దేశ మయిన మళయాలమునందు (కేరళ జేశము) నేఁటికిని నాచారమం దున్నవి. ఈ ద్రావిడులు సర్వసాధారణ జట్టును, పుట్టను, రాయిని, రప్పను వేయేల జంతు సామాన్యమును దేవతలగాఁ దలంచి పూజించువారు. తెలుఁగు దేశము మొదలు కన్యాకుమారి యగ్రము పరకుఁగల పల్లెలలోను, బట్టణములోను, నీదేవతలను నేటికీని జూడనగును. కాలక్రమమున రాయికప్పలు పోలేరమ్మ, ఆంకమ్మ, మద్దిరామమ్మ : పోతరాజు, మొదలగు గ్రామ దేవతలుగా మాఱి జన్మ స్థానమయిన ద్రవిడ దేశమును వదలనేరక నేటికిని నింజతాండవమాడుచున్నవి.. " క్రమ క్రమముగా నియ్యవి. 'తెలుగు దేశముస రూపుమాయు చుచున్నను, అరవ దేశ మునఁ జూరు పట్టుక వ్రేలాడుచు గ్రామరక్షణ చేయుచునే నున్నవి. ఇంతియ కాక నాగుల చవితి నాఁడు పూఁబోఁడు లెల్లరు పాలు , పుట్టలలో నున్న పాముల పాలు చేయుచుండుట మనము చూచుచునే యున్నాము. నాగేంద్ర స్వామియని పేరు చెప్పి