పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

శంబుకవధ


అం:- ఏమందురని మా యు ద్దేశ్యము ?

శం:-- ఇందు ద్దేశ్యమేల ! నిశ్చయమే. ఏకగ్రీవముగా నీశ్వరుని
        దృష్టియందుఁ దుల్యులని నిశ్శంకముగాఁ జెప్పెదరు.

అం: అటులయినచో నీ స్మృతులన్నియు నిట్టు లేల చెప్పిరి ! కారణ
       'మేమి చెప్పెదరు ? దీన ఋషులకు లాభమేమి ?

శం:- ఇదియే మనము శ్రద్ధగా విచారింపవలసినది. చెప్పెదవినుము.
       ఇవి సంఘనిర్మాణమునకు దీర్ఘ దృష్టి తోడను, నై పుణ్యముతోడను
      నేర్పఱచిన కట్టుదిట్టములు. ఈ శిక్షాస్మృతులే లేకున్న సంఘము
      చీకాకువడి నిర్వీర్యమును ! దుర్బలమును నగునని నమ్మి వీని
      బుట్టించిరి.

అం:-స్మృతులు: మతసంబంధములగు గ్రంథము లేకావా ?

శం: ముమ్మాటికిని గావు. సాంఘిక చరిత్రమునకు సంబంధించినవి,
      ఇట్లు వివరింపకయే రెంటిని గలకలపి మనలను: మత స్వాతంత్ర్య
      దూరగులఁ జేసి మహాపాతకమును మూటఁగట్టుకొను చున్నారు.
      భగవంతుఁ డిట్టివాడని యివి బోధించు చున్నవా ?

అం:- అటులయినచో స్మృతు లనవసర గ్రంథములనియా మీ యభి
       ప్రాయము?

శం: కుమారా అట్లు కాదు వినుము . పరాజితుల దమ సంఘమున
       నానూపర్చుకొనునప్పుడు జేతలు జాగరూకులై యుండుట ధర్మము.

అం: ఋష్యతంత్ర్యమును; స్వత్వమును నొసంగిన బాలితులకుఁ
        ............ లోపములును, బలాబలములును దెలియును.

శం: .... ..............ఉచ్చదశకు దప్పక భంగము వాటిల్లును.
       ..........................బాలకుల యాయువు పట్టు జూపించుట