పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మాం క ము

5

.

అం: లేదు, లేదు. మేము మీవలెనే కష్టము ననుభవించుచున్న
        వారమే. నేను గిష్కింధాపుర యువరాజును. అంగదుఁడను.

శం: అయ్యా ! ధన్యుఁడను. మీరు తప్పక మా యాతిథ్యమును
        గొని తీరనలయును. మాగురువు గారు మీ యాగమనమునకు
       మిగుల సంతస పడెదరు. సుగ్రీవ సార్వభౌముని సంగతి యప్పు
       డప్పుడు మాతో ముచ్చటించు చుందురు.

అం:నడువుము, వచ్చుచున్న వాఁడను. మీగురువు గారి సందర్శ
      నమువలన నేను బవిత్రుఁడనయ్యెద. మహాత్ముల సందర్శనము
      మాటలతో దొరకదుగదా ! (నిష్క్రమింతురు)

చిదానం దాశ్రమము.



 

(శల్యగతప్రాణుండును, జటావల్కల ధారియు,
శాంత స్వరూపుండు నయిన శంబుకు ప్రవేశము.)



శం– అబ్బా! యింకను రాలేదేమీ చెపుమా ? జడస్వభావుడు
        (పడమటి దిక్కున కత్తి చూచి) అడుగో !

      గీ! అంధకారానృతము లైన • యట్టి లోక
      ములకు నెల్లఁ బ్రకాశఁబుఁ * బొసఁగుచుండి
      జీవరాసుల నెల్ల వీ • క్షించు కర్మ
      సాక్షి, య స్తమించుచునుండెఁ జరమదిశను.

     స్వపక్ష పరపక్ష, భేదములు లేక యీశ్వరాగ్నా బద్ధుఁడై చేతనా
     చేతనములనెల్ల స్వార్థ త్యాగియై, ప్రత్యుపకృతి నభిలషింపక యొక
     కంటఁజూచు సూర్యభగవానుఁ డెంతకృతార్థుఁడు ? ఎంత ధన్యుడు?
     ఇందుచేతనే పామరజనంబులు కూడఁ బ్రాతః కాలముననే లేచి,