పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మాంకము.

3


        ఉ|| ద్రావిడ జాతియంచు మముఁ దానొకయప్పుడు లోన నమ్మఁగాఁ
        బోవక చూడనట్టులదె • పో యొక కంటను జూచుచుండు మే
        మేవి పొనర్చుచున్న , మ • యిచ్చునె సౌఖ్యము పారతంత్ర్యమా
        హా! విధి! రామరాజ్యమట!!యక్కట! యీగతినుం డెమాగతుల్


      (విచారించి, యీ నిర్వేదమువలన నేమి యుపయోగము?
     అడుగో ! సూర్యభగవానుఁ డపరదిక్కాంతకు, గుంకుముబొట్ట
     య్యెను. నేఁటికిందు విరమించి ప్రత్యూషంబున సాకేతంబుఁ జేరి
     రామచంద్రసందర్శనఁబుఁ గావించెద. నన్నొక యార్యునిగాఁ
    బుట్టించ నందులకు భగవంతునకు నేను గృతజ్ఞుఁడ. కాయగసరు
    లతోఁ గాలము గడుపఁ గల్గుదును. నిండుప్రాణముతో  నున్న యే
    జంతువునో పట్టి చంపి పొట్టఁబోషించుకొను నవసరము లేదు.
    ఆహా ! యేమి యీయరణ్యము పుష్పఫలభరితంబై యున్నది.
    ఎవ్వరో పండ్లు గోయుచున్నారు! (దరిఁ జేరి) అయ్యా ! యీ
    సంధ్యాసమయమునఁ బండ్లు గోయుచున్న వారెవ్వరు ?

శం. మేము రామదాసులము. అం ...... అనగా? శం...... . శ్రీ రామునిచే దాసులముగాఁ జేయఁబడినవారము. అం.... ..ఎవ్వరికి ? శం. ... ..శి----ద్విజపోతములకు . అం. ..ఎందుచే! శం. . మేము తమ జాతివారము కాకపోవుటచే. అం. ..అటులయిన మీరెవ్వరు ? శం... . శి----వారార్యులట, "మేమనార్యులమఁట.</poem>