పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xv

- వృద్ధియందున్నది. ఇందు చేతనే తెలుగు దేశమునందు గోమటులు, నరవ దేశమున వీర శైవులుశాఖ బక్షకులుగనే మిగిలి యున్నారు., .............. .............,................................ పశ్చిమ తీరమదున్న "మాపిళాలు” అరేబియా మహమ్మదీయులకన్నను,నిబపరులు గను, నా వేశపరులుగను నున్నారు. ఆర్వమతము గానీ, తన్నాగరికత గాని చేపట్టని వారలను అవతలకు దరిమి నీచముగాఁ జూడ నారంబించిరి. వీరికీ మాత్రుభాషలు (అనగా తెలుగు, అరవము మొదలగునవి) అనాగరిక భాషలైనవి. .........మత స్వీకారముచే సంస్కత ముత్యవసరమగుటకేఁ దద్భాషా పరిచయమునకై పట్టుదల జూప ప్రారంబించిరి. ద్రావిడ బ్రాహ్మణులిందు చేతనే యైతరేయ బ్రాహ్మణుల కన్నను నత్యద్భుత గీర్వాణ భాషాపాండిత్యమును సంపాదింప గలిగిరి: కాల గమనమున నీసంస్కతము వంశ పరంపరగా సంక్రమించిన ముల్లెయని భావించబడెను.సంస్కృ తఖాషా జ్ఞానముగలిగిన వీరికి తెలుగు భాష కోయ, చెంచు భాష యైనది. సంస్కృ తభాషావభిజులు మోటు వారలు. పశు ప్రాయులైరి. క్షణకాలమైన వీరికి ................ గనవసరమనునూహ మనంబుంకు దట్టలేదు. గాసటబీసటయై యనాగిరిక ..... మైన తెలుగును నాగరిక జనోపయోగమూజేయుట యుచితమని కొందరు మహాను బావులకు గోరిక పొడచూపినది. సంస్కృత శబ్దనించితమైన గాని పూజ్యము కాదని యెంచి మహానుబావుడు నన్నయ్య చెలియలికట్ట బ్రద్దలు కొట్టి సంస్కృతశబ్ద జాలఝ్ రిని తెలుగు దేశముమీదికి విడచెను. విడిచిన యనంతరము సంస్కృత శబ్దములను వ్రాయుటకు నాలుగు స్వర సమామ్నాయము చాలక కొరబడి యుండెను. ఈ కొరత తీర్చుటకు తెలుగు లిపికి "ఒత్తు " అక్షరములు చేర్చబడెను. ఇందుకును ఫల మేమి? తెలుగు దేశమంతయు వరద పాలయ్యెను. విశ్మయచిత్తుడై చెలియలికట్ట యవసరమని తలపోసి నన్నయ గంటము దీసికొని " ఆంధ్ర శభ్దానుశాసనంబు " సంస్కృతంబున రచించెను. తెలుగు వ్యాకరణము సంస్కృతంబున రచింపబడెను. ఏమి వింత ఏమి చిత్రము .. ఈ పిచ్చి ఇంతటితో ముగిసెనా? లేదు. తెలుగు వారలు కూడ కొంత కాలము వరకు తెలుగు వ్యాకరణములు సంస్కృతమునందే వ్రాసిరి.

సనాతన ధర్మమును సంపూర్ణముగా గ్రహింపజాలక పోయినను " అంకమ్మ. పోలేరమ్మ " గుడులగు బాడుండ జేసి యాస్థానములయందే సీతారాముల హనుమ దాదులకు గుడులు, గోపురములు కట్టించి ద్రావిడులు సంపూర్ణముగా హిందువుల