పుట:2015.386215.kumaara-sanbhavamu.pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(iii)

ఆచార్య నాయని కృష్ణకుమారి

ఉపాధ్యక్షులు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

లలిత కళాతోరణం.

పబ్లిక్ గార్డెన్స్,

హైదరాబాద్ - 500 004

సమర్పణ

బోధన, పరిశోధన, ప్రచురణ అనే మూడు విషయాలు లక్ష్యంగా తెలుగు సాహిత్యం, భాష, చరిత్ర, కళలు సంస్కృతి వంటి రంగాలలో కృషి సల్పడానికి 1985 వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. పూర్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలిత కళా అకాడమీలు ఇందులో విలీనం కావడంవలన పైన పేర్కొన్న లక్ష్యాలతోపాటు మరెన్నో బాధ్యతలు దీనికి సంక్రమించాయి అన్ని విశ్వవిద్యాలయాలవలె కేవలం పఠన పాఠనాలతో సరిపెట్టుకునే అల్పపరిధి కాదు దీనిది మన సంస్కృతిని ప్రపంచం నలుమూలలకూ వ్యాప్తి చేయడానికి ఉద్దేశింపబడిన “సాంస్కృతిక విశ్వవిద్యాలయ"మిది ప్రచారసాధనకు పరికరమే ప్రచురణ

ప్రచురణ కార్యక్రమానికి అనుగుణంగా ఈ విశ్వవిద్యాలయం ఇప్పటికెన్నోప్రముఖ గ్రంథాలను ప్రచురించింది వ్యాఖ్యా స్రవంతి శీర్షికన సుప్రసిద్ధ పండితులచే ప్రాచీన కావ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాలు వ్రాయించి ప్రచురించింది ఇప్పటివరకు ఈ ప్రణాళికలో కుమార సంభవం, కాశీఖండం, శివరాత్రి మాహాత్మ్యం వంటి గ్రంథాలను వ్యాఖ్యా సహితంగా ముద్రించింది

తెలుగులో పేరుపొందిన ప్రాచీన ఆధునిక గ్రంథాలను