పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భక్తమందారశతకము

శా.

శ్రీసాకేతపురీ వరంబున సునా సీరోపల స్థాపిత
ప్రసాదాంతర చంద్రకాంతిమణియుక్పర్యంక భాగంబునన్
శ్రీసీతాసతిఁగూడ వేడ్కలలరం గ్రీడించు మిమ్మెప్పుడున్
మా సన్మానస వీధిఁ గొల్చెదము రామా! భక్తమందారమా!

1


శా.

అస్తోకామల కీర్తికామ! లసదుద్య న్నిరద శ్యామ! భూ
విస్తార ప్రభుతా లలామ! త్రిజగత్ప్రఖ్యాత సన్నామ! ధీ
రస్తు త్యోరు గుణాభిరామ! భుజసారస్ఫార పౌలస్త్యదు
ర్మ స్తస్తోమ విరామ! ధీమహిత! రామా! భక్తమందారమా!

2


మ.

కదన ప్రాంగణకార్తికేయ! విలస ద్గాంగేయకౌశేయ! భా
స్వదు దంచద్ఘననీలకాయ! త్రిజగ త్సంరక్షణోపాయ! స
మ్ముదితాశేష మరున్నికాయ! దివిపన్ముఖ్యాతిగేయ! గరు
త్మద మేయాశ్వ! సుధీవిధేయగుణ! రామా! భక్తమందారమా!

3


మ.

అకలాంకయుత కీర్తిజాల! మహనీయాభీల శౌర్యస్ఫుర
న్మక రాక్షాసుర రావణప్రముఖ నానాదానవోత్తాల తూ
ల కరాళస్ఫుట వహ్నికీల! జయశీల! సద్దయావాల! హే
మకనచ్చేల! భ్ధానుపాల! రఘురామా! భక్తమందారమా!

4


మ.

దురిత ధ్వాంత పతంగ! సంగర మహా దుర్వార గర్వాహితో
త్కర సేనాకదళీ మతంగ! లస దేకాంతాత్మ పంకేజ సం
చర దుద్యన్మదభృంగ! ఔంగవ ఘన నీల శ్యామాంగ! సద్గంగ! క
మ్ర రమాలింగన సంగతాంగ! రఘురామా! భక్తమందారమా!

5