పుట:2015.373190.Athma-Charitramu.pdf/620

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 580

దేవయ్యశోధనను' వ్రాసి, బ్రాహ్మణ బ్రాహ్మణేతరకక్ష లనెడి కందురీఁగల గుమిని గదల్చుచుంటి నని నామిత్రులు కొందఱు భయపడిరి! కాని, ఆకథయందును 'బ్రహ్మానందము' నందును వారి సందియములకు వలయు సమాధానము గలదు. సద్భావము గల రచయిత యెన్నఁడును పక్షపాతబుద్ధి వహింపఁడు. లోకవిశేషము లందలి సత్యమును బ్రదర్శించుటయె యతని పని కాని, క్షణభంగురమగు జాతి మతవైషమ్యములతో నతనికి జోక్యము లేదు. "పార్వతి యనుతాపము" రచనాచమత్కృతియందును, భాషాసౌష్ఠవము చేతను, నా రచనము లన్నిటిలోను మిన్న యని నా యనుంగుమిత్రు లిరువురి యభిప్రాయము.

                   "ప్రేమాతిశయమునఁ బెంచిన మమ్ము
                    దు:ఖవారిధియందుఁ ద్రోచి తానైదు
                    వత్సరంబులకె జీవము వాసి దివికిఁ
                    జనిన మా చిన్ని పాపని కిది యిడుదు".

ఇటు లనుచు నేను, "ఎవ్వని యకాలమరణమువలన జనించిన యపారదు:ఖము నుపశమింపఁజేసికొన నాచేత నీకథలు కల్పితము లయ్యెనో, ఎవ్వాని జీవితస్మరణయె యిటీవల నాచే విరచితములగు 'ట్టికథలకు సందర్భములు వెలయించెనో, అకాలమృత్యువు వాతఁబడిన యా మాగారపు చిన్ని మేనల్లుని కీకథలపొత్త మంకిత మొనర్చి యొకింత మనస్సంతుష్టిఁ గాంచుచున్నాఁడను" అని యీపుస్తక పీఠికయందు వ్రాసితిని.

కొలఁదికాలములోనే మే మీనగరమును విడువ నున్నారమని యెఱింగి నేను, మేము నివసించెడి దండువారివీధిలో నాభార్య కోరిక