పుట:2015.373190.Athma-Charitramu.pdf/448

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 410

నిగఁ జేరు మని యెంద ఱెంతగఁ జెప్పినను నేను సమ్మతింపలేదు ! వేఱుమండలమున నివసించునా కీ మండలసమాజసభ్యత్వము బరుపులచేటని నేఁ దలంచితిని. దీనికి నన్నుఁ గొందఱు నిందించిరి. మఱునాఁడు విద్యావిషయక సభ జరిగెను. 30 వ తేదీని మే మందఱము బయలు దేఱి రాజమంద్రి వెడలివచ్చితిమి.

1 వ జూను తేదీని నేను మా బంధువులను జూచుటకు కాకినాడ పోయితిని. నా కచట నొక వైద్యునితోఁ బరిచయము కలుగఁగా, తల్లికిని భార్యకును వారియొద్దఁ గొంతమందు పుచ్చుకొంటిని. అచట నున్నదినములలో 'రాజాగారి కళాశాల'లో నొక యుద్యోగము ఖాళీయగుననియు, నా కది లభింపఁగల దనియు మిత్రులు చెప్పిరి. 20 వ తేదీని మరల మేము బెజవాడ ప్రవేశించితిమి.

సంఘసంస్కరణోద్యమ ప్రచారమునకై నేను గొందఱు మిత్రులతోఁ గలసి, 6 వ జూలయిని బాపట్ల బయలుదేఱితిని. మార్గ మధ్యమున మమ్ముఁ గొందఱు మిత్రులు గలసికొనిరి. మే మందఱము నచట నుపాధ్యాయులగు బొప్పూడి వెంకటప్పయ్యగారియింట బస చేసితిమి. డిస్ట్రిక్టుమునసబుగారు బహిరంగసభ కధ్యక్షులు. విన్నకోట కోదండరామయ్య రాజగోపాలరావుగార్లు ప్రారంభించిన చర్చలో మే మందఱమును పాల్గొంటిమి.

పూర్వము పాఠశాలకార్యక్రమము సాగించుటలో అనంతముగారికి సామాన్యముగ నేను సహాయము చేయుచుండు వాఁడను. ఇపు డాయన, సాంబమూర్తిగారు మున్నగు క్రైస్తవ బోధకుల సలహా పుచ్చుకొనుచు, వారల చేతనే కాలనిర్ణయపట్టిక మున్నగునవి