పుట:2015.373190.Athma-Charitramu.pdf/410

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 372

సము విని, ఆయనతో మాటాడితిమి. 4 వ ఫిబ్రవరిని పరశువాకము వెళ్లి వీరేశలింగముగారిని జూచివచ్చితిమి. ఆయన యచట విశాలస్థలమున నొకభవనము కట్టి, అందు 'వితంతుశరణాలయము'ను నెలకొల్పి నడుపుచుండిరి. ఆసాయంకాలము మేము చెన్నపురి విడిచితిమి.

24 వ ఫిబ్రవరిని వీరభద్రరావుగారితోఁ గలసి నేను రెయిలు స్టేషనునకుఁ బోయి, వీరేశలింగముగారికొఱకుఁ గనిపెట్టుకొని యుంటిని. పంతులుగారు సకుటుంబముగ చెన్న పురినుండి ప్రయాణము చేయుచుండిరి. మేము కొనిపోయిన యన్నము వారు భుజించిరి. తాము విశాఘపట్టణముజిల్లా పోవుచున్నా మనియు, తమతో వచ్చెడి బాలవితంతువును న్యాపతి శేషగిరిరావుపంతులుగారి కిచ్చి యిక్కడ వివాహము చేతుమనియు, వివాహ మగువఱకు నే నీసంగతిని రహస్యముగ నుంచవలెననియును, పంతులుగారు చెప్పిరి. పెండ్లికుమారుని యన్న గారగు సుబ్బారావుపంతులుగారు రాజమంద్రిలో నుండుటవలన, ప్రమాదవశమున నీసంగతి వారికిఁ దెలిసినచో, వివాహమున కంతరాయము సంభవింపవచ్చు నని పంతులుగారి భయము !

ఈరోజుననే మాతల్లి, తమ్ముఁడు కృష్ణమూర్తి, చెల్లెలు కామేశ్వరమ్మయును, మమ్ముఁ జూచిపోవుటకు బెజవాడ వచ్చిరి. వైద్యుని బిలిపించి మాతల్లిని జూపించితిని. ఔషధ మిచ్చెద మని యాయన చెప్పిరి.

నాకు రెండువేలరూపాయిలు బదు లిచ్చెదరా యని నా పూర్వ శిష్యుల నిద్దఱిని నే నడుగఁగా, ఈయలేమని మోమోటముచేఁ జెప్ప లేక, వారు కొంత కాలయాపనము చేసిరి. ఈ సంగతిని స్పష్టముగఁ దెలిసికొనుటకై నేను వారియింటికిఁ బోఁగా, వారిలో నొకఁడు తన లెక్కలపుస్తకము నాముందు వేసెను. ఆయనయొద్ద దమ్మిడియైనను