పుట:2015.373190.Athma-Charitramu.pdf/289

ఈ పుట ఆమోదించబడ్డది

10. బెజవాడ స్నేహితులు 251

డించుచు, పట్టణవార్తలు విడ్డూరములును బ్రస్తావింపుచుండువాఁడు. శిష్యుఁ డని యీసడింపక, అవ్యాజప్రేమమున నే నాతనిని మన్నించు చుండువాఁడను. రాజగోపాలరా వనిన రాజారావున కంతగఁ బడెడిది కాదు. ఆజానుబాహువగు రాజారావువలెఁగాక రాజగోపాలరావు పొట్టిగ సన్నముగ నుండి, ఆంధ్రసారస్వతమునఁ జక్కని యభిరుచి గాంచియుండుటచే నే నాతనిఁ బ్రేమించువాఁడను. పిమ్మట నీతఁడు నాపత్రికకు "స్త్రీచరిత కదంబము" అనుపేరిట కథలు వ్రాయుచుండువాఁడు.

1894 సంవత్సరము డిసెంబరులో మద్రాసున జాతీయ సభలు దర్శించుటకై, వీరేశలింగముపంతులు రంగనాయకులునాయఁడు గార్లు రాజమంద్రినుండి ప్రయాణముఁ జేసి, మార్గమధ్యమందలి బెజవాడలో నొకనాఁడు నా కతిథులైరి. వీరేశలింగముగారు మాయింట విడియుటకు నింటివారు తప్పుపట్టక, మీఁదుమిక్కిలి వారికి వంట చేయుటయందు నాభార్యకు సాయముఁగూడఁ జేసిరి. నేను మా తమ్ముఁడు వెంకటరామయ్యతోఁగూడి వారితోఁ జెన్న పురికిఁ బ్రయాణమైతిని. రాజమంద్రిస్నేహితుల మంత దేశీయమహాసభకుఁ బోయెడి తక్కినవిద్యాధికులతోఁ గలసి యొకబండిలో నెక్కితిమి కాన, ప్రయాణకష్టము మాకేమియుఁ దోఁపలేదు. పూర్వాచారాపరులగు సహచరులతో సంఘసంస్కరణమునుగుఱించి యత్యధికముగ వాదించుట వలన, వీరేశలింగముగారికి రెయిలులో గొంతు బొంగుపోయెను !

ఆ సంవత్సరమున జాతీయసభ కధ్యక్షుఁడు, వృద్ధుఁడు, బ్రిటిషుపార్లమెంటు సభ్యుఁడునునగు ఆల్ ఫ్రెడు వెబ్బుదొర, రెండవ నాఁటి యుపన్యాసకులలో పార్ల మెంటు సభ్యుఁడగు 'కీ' ముఖ్యుఁడు. ఈతఁడు తడవుకొనక, చేతనుండు కాకితమువంకనైనఁ జూడక, గంటల