పుట:2015.373190.Athma-Charitramu.pdf/113

ఈ పుట ఆమోదించబడ్డది

19. సంఘసంస్కరణ సమాజము 75

నొకసంఘముగ నేర్పడి, సంస్కరణమునుగూర్చి జనులలో సంచలనముఁ గావింపవలె ననియును మేము నిర్ణ యించుకొంటిమి.

నా సంస్కారప్రియులగు మిత్రులలో మఱికొందఱినిగుఱించి యిచటఁ జెప్పవలయును. తాడినాడ గంగరాజు కళాశాలలో ప్రథమ వత్సరముననే నా సహపాఠి, నరసాపురనివాసి యగుటచే నితఁడు కనకరాజున కిదివఱకే స్నేహితుఁడు. ప్రప్రథమమున నీతఁడు మతవిశ్వాసము లేనివాఁ డైనను, సంఘసంస్కరణ మనిన నావలెనే చెవిగోసికొనువాఁడు. హిందూదేశమందలి ప్రస్తుత పరిస్థితులనుబట్టి, ఆస్తికులు గానివారు సంస్కరణోద్యమమును జనరంజకముగఁ జేయఁజాల రని మిత్రులము బోధించుటచేత, క్రమముగ నీతనికి బ్రాహ్మమత విశ్వాస మంకురించెను. పర్లాకిమిడి వాస్తవ్యుఁడగు రాజగురువు, బ్రాహ్మమతవిశ్వాసి యైనను గాకున్నను, దానియం దధికాభిమానము గలవాఁడు. సంఘసంస్కరణము నందు మా కెవరికిని దీసిపోని పట్టుదల గలిగి, వాక్కర్మలం దేమాత్రమును వేగిరపాటు లేక మెలఁగ నేర్చినవాఁడు. మంచి యొడ్డుపొడుగు కలిగి, వట్టి విద్యార్థివలెఁ గాక యేయుద్యోగివలెనో యితఁడు గానఁబడుటచేత, నిదానమున నీతఁడు చెప్పుమాటలు శాంతమూర్తి యగు ననుభవశాలినోటినుండి వెడలు హితవాక్కులవలె వినవచ్చుచుండెను. మితవాది యగు నిట్టివాఁడు మధ్యవర్తిగ నుండుట మంచి దని తలంచి, మాసభలకు దఱచుగ నీతని నగ్రాసనాధిపతిగ నెన్ను కొనుచుందుము.

సత్తిరాజు మృత్యుంజయరావు పట్టపరీక్షయం దొక శాఖలో గెలుపొంది, సంఘసంస్కరణముపట్ల నమితాభిమానము గలిగియుండువాఁడు. ఇతనిసోదరు లిరువురు నాకు సహపాఠు లైనను, వారలతో కంటె నీతనితోనే నాకు చన వెక్కువ.