పుట:2015.372978.Andhra-Kavithva.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

20


సయ్యది స్వతంత్ర ప్రదర్శన మనిపించుకొను నేకాని యథా మాతృకానుకరణ మెప్పట్లను గాదని స్పష్టముఁ గావించెను. ఈవివాదమునకవికి సృష్టిఁ గావించుటకు నపారమగుశక్తియును, దుర్నిరీక్ష్యమగు స్వాతంత్ర్యమును నొప్పుకొనఁబడినవి. కవిని బాహ్య ప్రకృతియుఁ దత్సంబంధములగు నాచారవ్యవహారము లును నియమములుసు బంధింపవనియు స్పష్టమగుచున్నది. కాని కొందఱు కుతర్కమునకు దిగుదురేమో యనుభయమున లాజ్గీనీస్ బాహ్య ప్రపంచమునకును గవితా ప్రపంచమునకును గలసంబంధమును స్పష్టముగ నిట్లు వ్యక్తీకరించెను.

కావ్యసృష్టికిని బాహ్య సృష్టికిని సూత్రాత్మలు యందు భేదము లేదు.

కావ్య ప్రపంచమునకును బాహ్య ప్రపంచమునకుసు సూత్రాత్మ, లసఁదగు ప్రథానవిషయముల నెక్కువ భేద ముండ దనియు, నప్రధానములగు తక్కుంగల నియమములవిషయము ననే భేదము గలుగుననియు, బాహ్య ప్రపంచమునకును గావ్య ప్రపంచమునకును జన్మస్థానమగు భగవంతుఁడే యీ రెండు ప్రపంచములకును సూత్రాత్మలవిషయమునఁగల యైక్యభావమునకుఁ గారణమనియుఁ దెల్పెను, అట్లు తెల్పి కావ్య ప్రపంచ మభూత కల్పితము గాదనియుఁ, బ్రకృతిపరిణామ భేదము లన్నియు సూక్ష్మముగను గోన్ని యెడల స్థూలముగను. గూడఁ గావ్య ప్రపంచమునకు వర్తించుననియు, నందుచేఁ గావ్యపర మావధి ప్రహసనప్రలాపాదిశుష్క నీరసవాక్యరచనగాదనియు, రసోద్దీపకమగు స్వతంత్ర కావ్యరచనమే యనియు, నందుచే గవి యసత్య ప్రలాపి కాఁడనియు, నాతీత సామ్రాజ్యమున వేదాం