పుట:2015.372978.Andhra-Kavithva.pdf/311

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


యెన్నెన్ని విధములఁ ద్రిప్పికొనుచుఁ, జిట్లించుకొనుచు, దిద్ది కొనుచు, మార్పులను జెందుచుండ నట్టి మార్పులన్నియుఁ బ్రతి ఫలించుచుండునో, యట్లే మానప జీవితమునందుఁ గల్గు మార్పు లన్నీ యుఁ, బరిణామ భేదము లన్నియు, విశేషములుసు వికారములు నన్నియు జీవద్భాషయందుఁ బ్రతిబింబితములగు చుండును. కావున జీవద్భాష ప్రజా జీవిత దర్పణమని గ్రహింప నొప్పును.

-పురాతన భాషల మృతభాష లనఁ జెల్లదు...

జీవద్భాషలకును బురాతన భాషలకును నెట్టిసంబంధమని, ప్రశ్న ముదయింప వచ్చును. కొన్ని భాషలు జీవద్భాషలనియు,, మణికొన్ని మృత భాషలనియు నాగరక సాహిత్యవేత్తలు పల్కు చున్నారు. మృతభాష లనఁగాఁ బ్రస్తుతము నిత్య వ్యవహారము లేక గ్రంథస్థములుగ మాత్ర, మున్న భాషలనియే వీరి యభి ప్రాయము. ఈయభిప్రాయ మెంతయుఁ దప్పని మాతలంపు. ఏలనన నీత్వవ్వవహారములకుఁ గాలపరిమితియు, రూఢియు లేవు.ఎన్ని వేల సంవత్సరములు భాషకు జీవిత పరిమితిగ నిర్ణయింపఁ దగునో యెవ్వరును జెప్పఁజాలరు. 'కాలో హ్యయం నిరవధి?" అని భవభూతి యుద్దేషించుచుండ భాషా వితమునకుఁ బరిమితిఁ గల్పింప జూచుట సాహసమే యగుంగాని యన్యము కానేరదు. అనేక వేలయేండ్లు వ్యవహారమున నుండి, విశ్రుత 'వాఙ్మయము గలిగియుండి, నేఁటికిని సహృదయ హృదయానం దముఁ గూర్పఁగల సంస్కృతము, గ్రీక్, ల్యాట్ మొదలగు భాషలను మృతభాష లగుటకంటెఁ బొరపాటు వేఱిఁకేదియు నుండదు. అదియునుంగాక వ్యవహారమునకు రూఢన్ని నిర్ణ