పుట:2015.372978.Andhra-Kavithva.pdf/275

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

షష్ణ

ఆంధ్ర కవిత్వచరిత్రము


అలంకారము లవసరములా! రామలింగా రెడ్డి గారివాదము.

రీతుల సంగతి యటుండనిచ్చి యలంకారముల సంగతి కొంచెము విచారిం చెదము. అలంకారము లన నేమి? అవి యెన్ని విధములు? అవి యవసరములా? అనవసరములా? ఏవి ముఖ్యములు, ఏవి ముఖ్యములు కొవు? అను నీవిషయములకు సమాధానము నరయుదము. మనుజునకు నగలు నాణేములు వస్త్రము లావిగాఁగలయవి యెట్లు అలంకారములై యంద మొసఁగునో, అట్లే కావ్యమునకును కొన్ని యలంకారము లుండునని చెప్పఁబడుచున్నది. అట్టి యలం కారములు 'కావ్య మునకు భూషణముల వంటివై యందమును గూర్చును. కావు ననే వాని నలం కౌరములనీ లాక్షణికులు నిర్వచించి యున్నారు. అట్టి కావ్యాలంకారములు ద్వివిధములు---అర్థాలంకారములు శబ్దాలంకారములు నని. అలంకారము లవసరములా, అనవసర ములా? అర్థాలంకారములు ముఖ్యములా, శబ్దాలంకారములు ముఖ్యములా? అనువిషయమును గూర్చి చాల వివాదము చెల రేఁగినది! అర్థాలంకారము లనఁగ, నర్థమునకు సంబంధించిన యలంకారములు; ఉపమోత్ప్రేక్షాదులు. శబ్దాలంకారము లనఁగ యమకాను ప్రాసాదులు. శ్రీయుత రామలింగా రెడ్డిగారు మన యాంధ్ర భాషలో నీయలంకారములఁ గూర్చి విమర్శించి సహజముగ, న ప్రయత్నముగ వచ్చు నలం కారములను మిత ముగ వాడవచ్చుననియు, నట్టి యర్థాలంకారములను కవి తాను వర్ణించునప్పుడొక్కింతయెక్కువగ వాడినను దోషము లేదనియు నాటకపు పట్టుల యందును, రసాస్పదములగు పట్టుల యందును