పుట:2015.372978.Andhra-Kavithva.pdf/162

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసస్వరూపనిరూపణము

145

స్థాయీభావము విరుద్ధభావములను సైత మాత్మభావమును దాల్చునట్లోనర్చును.

అట్టి రసపారవళ్యముఁ గన్న రాధకు స్త్రీ జనసహజమగు నీర్ష్యయయు మృగ్యముగ నుండును. ప్రపంచమున నెట్టిపతి వ్రతయయినను భర్త యన్య కాంతారతుఁడై యుంట కంట గింపుగను ఏర్యా జనకముగను నుండును. ప్రపంచమునందలి , యుంపుడుకత్తెల ఈర్ష్యావిషయమును విస్తరించు టనవసరము. కాని, ప్రేమపరవశయగు రాధకు శ్రీకృష్ణుని యవగుణ ములు సవినయమును గోపమును చెప్పించుటకు మాఱుగఁబ్రేమము నే జనింపఁ జేయును. శ్రీకృష్ణుఁ డెచ్చటనై నను నెవ్వతే తోనైనను సంతోషముగనున్న జాలును. రాధకు! తనతోడనే సౌఖ్య మనుభవింపవలె ననులోభబుద్ధి ప్రణయసిద్ధి గలిగిన కతన బాధయందు నశించెను. స్వసౌఖ్యము గాదు! శ్రీకృష్ణుని సౌఖ్య మే రాధ కభ్యర్థనీయము. ఈభావమును జయ దేవకవి తన గీతగోవింద శ్రావ్యమున నిట్లు వర్ణించినాఁడు..

 శ్లో. గణయతి గుణ గ్రామం గ్రామం భ్రమాదఫి నేహ తే
వహతి చ పరితోషం రోషం విముంచతి దూరతః,
ఇహ ,విహరతి వనే కృషే వల తృ మాం వినా
పునరపి మనో వామం కామం కరోతి కరోమి కిమ్?

ఆహా ! రాధ యెంతటి ధన్యాతురాలు ? 1.పెమనస్సు ఎంత నిర్తల మయినది? ' గుణములనే గ్రహించునుగాని పొరఁబాటుననైనను లోపముల గ్రహింపదు! పరితోషమును బొందునేకాని, రోషమును బొందదు! రోషమును దూరముగఁ బారద్రోలును! తన్ను విడిచి అతీతృష్ణతో, నస్య కాంతల యెడఁ ఆంధ్ర కవిత్వ--10