పుట:2015.372978.Andhra-Kavithva.pdf/150

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము

133


కును సర్వసముద్రములను క్షోభింపఁ జేయుటకును సమక టటెను, సీతాపహరణమునకై ప్రతి క్రియగ శ్రీ రాముఁడు కావింపం బూనినకృత్యములు లోకభీకరములుగ 'జాల్మీకి మహర్షి చే వర్ణంపఁబడినవి. ఇట్టి మహావైష్ణుర్య ప్రతీకారమునకు నిజమగు కారణము సీతయందుఁ దగిలి స్థాయికొందిన శ్రీ రాముని ప్రణయ రసమేకాని యన్యము గాదు. లవణాకరుఁడు సర్వమును గబళించునట్లును, నగ్ని దేవుఁడు సర్వమును సాహుతిగఁ గొని దహించునట్లును, రాముని ప్రణయము సర్వవిషయములను మఱచునట్లును, సర్వభావములను ద్యజించునట్లును, సీత దక్క నన్యము గోచరింపకుండునట్లును చేసెను. స్థాయీభావలక్షణ మదియేకదా!

శ్రీసీతారామచంద్రుల ప్రణయ వ్యాపారముల భావము నకు స్థాయి బాగుగ గుదిరినట్లు సంస్కృత గ్రంథములవలన స్పష్టమగుచున్నది. ఎంత స్థాయి గుదిరినది; అట్టి ప్రయాసముల కోర్చి సుగ్రీవాదుల సాయము నపేక్షించి యన్యాయముగ వాలిని సయితముఁ జంపి కొండయనక, కోనయనక, చెట్టనక, పుట్టయనక, సర్వ దేశములను వానరులచే వెదకించి సీతజాడ గని, సామాన్యమానవుల కజేయుఁడును, దపోధురంధరుఁడును “అయి ఖలు విషమః పురాకృతానాం భవతి హిజంతుషం కరణాం విపాకః" అనుసర్యోక్తికి గాళిదాసుని చేఁ బ్రధాన లక్ష్యముగఁ గైకొనఁబడినవాఁడును, నహంకారస్వరూపుడును, నిజ శిరస్సులచే శివునకు నిత్యమునుఁ బూజయొనర్చునట్టి భక్తాగ్రే సకుఁడును, సపూర్వమే భావంతుఁడును, శౌర్య రాశియు నగు రావణునంత వానినిఁ బోర నెదిర్చి యమిత శ్రమమున