పుట:2015.372412.Taataa-Charitramu.pdf/81

ఈ పుట ఆమోదించబడ్డది

10. పట్టుపరిశ్రమ.

చాల శతాబ్దులనుండి మనదేశమున పట్టుబట్టల వాడుక కలదు. అవి ప్రియమై మన్నిక కల్ల్గి, అందముగనుండును. వీనిని శ్రీమంతులు ధరింతురు. సామాన్యజనులు పరిశుద్ధమని మడికి ఉపయోగింతురు. పట్టునేత మనదేశమున చిరకాలమునుండి చాలమందికి వృత్తిగనున్నది. ఈపరిశ్రమకును గతశతాబ్దిలో విదేశపుసరుకుల దాడిచే హానికలిగినది.

పట్టుపురుగులనబడు ఒకజాతి పురుగులు గూడు నేర్పర్చుకొని, అందు వసించుచు, ఆగూడులోనే తమదేహమునుండి పట్టును నిర్మించుకొనును. అది దూదికన్నను మృదువై, మనోహరముగనుండును. ఈపురుగులు మల్బర్రీ చెట్ల యాకులదిని జీవించును. ఆచెట్లువృద్ధియగు తావులందే యాపట్టుపరిశ్రమ కవకాశముండును. కొన్ని పట్టుపురుగులు ఆముదపు ఆకులగూడ దిని, వసింపగలవు. పట్టుబట్టలకు దుకూలము చీనాంబరము అనియు వాడుక కలదు. చీనాలో, ఈపరిశ్రమ చిరకాలముగ వ్యాపించి యున్నది. అందుండి కొన్నిశతాబ్దములక్రింద కొన్ని పట్టుపురుగులను మల్బర్రీని కొందరు రహస్యముగ ఇటలీ ఫ్రాన్సులకు గొనిపోయి పెంచిరి. క్రమముగా నచట పట్టుపురుగులు వృద్ధియై, కొంతకాలముకు ఆధునిక యంత్రసహాయమున చాల నాజూకగు పట్టు తయారుకాజొచ్చెను. అదిచౌక; మన కోరా