పుట:2015.372412.Taataa-Charitramu.pdf/80

ఈ పుట ఆమోదించబడ్డది

రోదనమయ్యెను; కాని యీ యార్ధికసమస్యచర్చ జనులలో చాల ఆందోళనను విమర్శను కల్గించినది.

*[1]


_________
  1. * ఈపన్ను వేయుట చీనాలో జపాను మిల్లుబట్టల వృద్ధికి సహకారియైనది. జపాను బట్టలు చీనాలో మనమిల్లు బట్టలతో పోటీ సల్పుటయే గాక, క్రమముగా మనదేశముకు ఆఫ్రికామున్నగు ప్రాంతములకు కూడ వ్యాపించి, బ్రిటిషు మిల్లు సరుకులతో తీవ్రముగ పోటీచేయుచున్నవి. ఇట్లు బ్రిటిషుప్రభుత్వము నిర్బంధముగ ఈదేశపు మిల్లులపై విధింపజేసిన పన్ను, ఇచటి మిల్లులకే గాక, తుదకు బ్రిటిషువారి వ్యాపారముకును ఒకవిధముగ హానికల్గించెను. ఇంతలో యూరపుమహాయుద్ధముచే, మన ప్రభుత్వపు ఆర్ధికస్థితి మరలచెడెను. మరియు, ఆయుద్ధసమయమున మనప్రభుత్వము వారు బ్రిటిషు ప్రభుత్వముకు 150 కోట్ల రూప్యముల నుచితముగ నిచ్చుట కొప్పుకొనిరి; అప్పటి యుద్ధమున మనసేనలఖర్చును మనఖజానానుండియే భరించిరి. 'ఇట్లు ఖర్చు హెచ్చి ఆదాయము తగ్గగనే, కొత్తపన్నుల వేయవలసివచ్చెను. అంతట బ్రిటిషుప్రభుత్వపు అంగీకారముతో, ఈదిగుమతి పన్నును 1917 లో కొంచెము హెచ్చించిరి. తరువాత నీపన్ను బ్రిటిషుసరుకులపై కొంత హెచ్చు రేటుగను, జపాను మున్నగు ఇతరవిదేశములపైన ఇంకను హెచ్చుగను, ఉండుటకు నిర్ణయమయ్యెను.