పుట:2015.372412.Taataa-Charitramu.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాపించియుండెను. కాని 18 వ శతాబ్దినుండి, ఆపరిస్థితి మారెను. యూరపులో నాంగ్లేయులుమున్నగువారు స్వయంకృషిచే తమతమదేశములందే వస్త్రపరిశ్రమ వృద్ధిచేసుకొన దొడగిరి; మనదేశమునుండి వస్త్రములను కొనుట మానిరి; అప్పటికి యూరపులో నూలు మనదేశపునూలుకన్న చాల ముదుకుగ నుండెను. మనదేశమునుండి దిగుమతియగు నూలుపైన, బట్టలపైన, క్రమముగా పాశ్చాత్యులు హెచ్చుపన్ను విధించిరి. ఐనను కొందరు నాజూకుగానున్న మన సన్నబట్టలనే కొనుచుండిరి. అందుపైన మనదేశపు సన్నరకపుబట్టలు తమదేశముకు రానీయకుండ నచ్చటిపాలకులు నిషేధించిరి. తమదేశపు పరిశ్రమల ననేకవిధముల బ్రోత్సహించిరి. ఇట్లు మన బట్టలకు యూరపు యెగుమతి లేకుండబోయెను. మరియు మనదేశము 'ఈస్టిండియాకంపెనీ' అను బ్రిటిషువారి వ్యాపారసంఘముయొక్క పాలనమున బడెను; ఆకంపెనీ యింగ్లండునుండి నూలు బట్టలు తెచ్చి, మనదేశమం దమ్మి, లాభమొందదొడగిరి. వారు తెచ్చు బట్టలతో పోటీలేకుండుటకై, ఆకంపెనీ పాలనమున మనదేశపు సాలెవాండ్ర కనేకనిర్బంధము లేర్పడెను. మన స్వతంత్రదేశీయ రాజ్యములు నశించెను; మన ప్రభుత్వసహాయము క్షీణించెను. ఈస్థితిలో ఆంగ్లదేశమున 19 వ శతాబ్దిపూర్వార్థమున ఆవిరితో నడుపు 'ఇంజను'లను మరమగ్గములను కనిపెట్టిరి. వానిసహాయమున మిల్లులందు సన్ననిబట్టలను సమృద్ధిగ తయారుచేసి, మన