పుట:2015.372412.Taataa-Charitramu.pdf/172

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాతా కంపెనీ స్థాపించిన యీసంస్థలన్నియు రిజిష్టరు చేయబడిన లిమిటెడుకంపెనీలు. ఈకంపెనీల వాటాలను అందరును కొనవచ్చును. వాటాదార్ల సమావేశములం దీకంపెనీల డైరక్టర్లు ఎన్నుకొనబడుదురు; వారిచర్యలు, కంపెనీస్థితి, ఆసమావేశములందు చర్చకు ఆమోదముకు వచ్చును. ఒకరిద్దరు వ్యక్తులపైనే ఆధారపడు సంస్థలు వారియనంతరమును, వారిపరిస్థితులు మారుటవలనను, తరుచు త్వరలోనే క్షీణించిపోవుట యెరుగుదుము. అట్లుగాక నివి అనుభవము పలుకుబడి గల బొంబాయి వ్యాపారస్థులచే ప్రస్తుతము నడుపబడుచున్నవి. వీని యన్నిటికి కేంద్ర కార్యాలయములు బొంబాయి లోనే యుండును. ఈసంస్థలందు ప్రజాప్రతినిధు లెక్కువ శ్రద్ధవహించి, చాలమంది వాటాల దీసికొని క్రమముగ వానిని జాతీయసంస్థలుగ జేయింప యత్నించుట యవసరము.


_________