పుట:2015.372412.Taataa-Charitramu.pdf/167

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరువాత తాతాకంపెనీవారి లండనుశాఖ పర్యవేక్షణకై, రత్నజీతాతా యింగ్లండుకు జని, లండనునందే యుండిపోయెను. అచట తనబంధువగు శక్లత్వాలాతోకలసి వ్యాపార కార్యములందును, సాంఘికసమస్యల పరిష్కారమందును పాల్గొనుచుండెను. లండనులో సాంఘికశాస్త్రపరిశోధనలకై చాల ద్రవ్యమును నిధిగనిచ్చెను. కొంతకాలమునకు జబ్బుచేసి, రత్నజితాతా 1918లో నింగ్లండులోనే చనిపోయెను. దొరాబ్జి రత్నజీ లిద్దరును చాలమందిబీదలకు విశేషద్రవ్యసహాయము చేయుటయేగాక, అనేకప్రజోపకారి సంస్థల బోషించిరి. దొరాబ్జితాతా భాండారకర సంస్కృతపరిశోధన సంస్థకును పూనాలో పార్సీలపూర్వచరిత్ర గూర్చి విమర్శచేయుటకును, చాల ద్రవ్యసహాయము చేసెను. సోదరులిరువురును జనోపయోగకరమగు కొన్నిపరిశోధనలను స్వయముగ చేయించిరి.

జంషెడ్జి జ్యేష్ఠపుత్రుడగు దొరాబ్జితాతా తనతమ్ముని కన్న నెక్కువ దృఢగాత్రుడు; ఆయన తనతండ్రి యభిలాషను పూర్తిగా సాగించి, జంషెడ్జి యారంభించిన యుద్యమముల నన్నిటిని జయప్రదముగ నెరవేర్చి, వృద్ధిచేసెను. తాతాకుటుంబము మనదేశపు పరిశ్రమల వృద్ధికై చేసిన యపారకృషికై, దొరాబ్జి రత్నజీ లిద్దరకును ప్రభుత్వవారు 'సర్‌' బిరుదము నిచ్చిరి. భారతజాతి తనఆమోదమును మరియొక విధమున స్పష్టముగ తెల్పెను. మనజాతీయమహాసభతోబాటే, ఆసభ