పుట:2015.370800.Shatakasanputamu.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకమును యథావాక్కుల అన్నమయ్య శా. శ. 1164 కు సరియగు (క్రీ.శ. 1242) శుభకృత్సంవత్సరమున రచియించినటుల 130, 133, 142 పద్యములంబట్టి తెలియుచున్నది. ఈతఁడు కాలమునుబట్టి తిక్కన సమకాలికుఁడుగాఁ జూపట్టుచున్నాఁడు.

ఈతఁడు వీరశైవుఁడు. దూదికొండ సోమేశ్వరారాధ్యులవారి శిష్యుఁడు. అమోఘకవితాధారాసంపన్నుఁడు. గ్రంథమువలన నీతనికులగోత్రాదులను గురుతింప వీలుకలుగదు. ఈశతకము కవి తానుస్వయముగాఁ జెప్పుకొన్నటుల (చూ. ప. 188) భక్తరంజనముగ, తత్త్వప్రకాశముగ, చిత్రార్థబంధురముగ, క్షేత్రానందకరముగ నుండె ననుట కెట్టిసంశయము లేదు. కవిత నిర్దుష్టముగ నున్నది.

ఈతనిగుఱించి యాంధ్రసాహిత్యపరిషన్ముద్రితప్రతి పీఠికయందు,

"యథావాక్కుల అన్నమారాధ్యుఁ డాత్రేయసగోత్రోద్భవుఁడు, యజుశ్శాఖాధ్యాయి, గోదావరీతీరవాసి, రాజమహేంద్రవరమునకు సవిూపమున నున్న పట్టెస మనుగ్రామమందు వెలసిన వీరభద్రేశ్వ