పుట:2015.370800.Shatakasanputamu.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     అట్టిభక్తుల [1]లింగదివ్యాంఘ్రియుగళ
     శేఖరులఁ [2]జేర్చి రక్షించు చెన్నమల్లు.10
సీ. నీరూపు నీరేఖ నీయన్ను నీచెన్ను
                     నీపెంపు నీసొంపు నీచలంబు
     నీమూర్తి నీస్ఫూర్తి నీశాంతి నీకాంతి
                     నీలాగు నీబాగు నీవిధంబు
     నీబల్మి నీకల్మి నీయురుల్‌ నీసిరుల్‌
                     నీనెఱి నీగుఱి నీమెఱుంగు
     నీనల్వు నీచెల్వు నీలలి నీలులి
                     నీరీతి నీభాతి నీస్థిరంబు
ఆ. తనువునందుఁ గుదురుకొని కనుఁగవ వెళ్లఁ
     బారి మదిఁ బెనంగి ప్రాణముగను
     నీవయై చరించు నీమహాభక్తులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.11
సీ. అతులిత పరమశివాచార సార స
                     న్మార్గంబు గతియును మతియునేని
     రాజిత గురులింగ పూజనోత్సవ మేళ
                     నంబు పదము పదార్థంబునేని
     సంతత సముచిత సత్కాయజంగమ
                     భక్తియు శ్రీయు సంపదయునేని

  1. మహిత
  2. శేఖరులఁ జేర్పవే నన్ను