పుట:2015.370800.Shatakasanputamu.pdf/136

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

దేవకీనందనశతకము రచనాక్రమము కవితాధారఁ బట్టి చూడఁ బూర్వకవికృతమని తోఁచును. ఇందలి పద్యములు శ్రీకృష్ణభగవానుని లీలావిహారాదికములను గొండాడుచు విష్ణుమహిమాదికములఁ బ్రశంసించుచు మృదుమధురపదగుంఫనములతో సుకుమారములగు సమాసములతో నలరారుచున్నవి. ఇందలి కృష్ణలీలావర్ణనములలోని పద్యములు శ్రీకృష్ణకర్ణామృతము ననుసరించి వ్రాయఁబడినవి విశ్లేషించి కలవు. దృష్టాంతమున కొకదానిని జూపుచున్నారము.

ఉర్వ్యాంకోపి మహీధరో లఘుతరోదోర్భ్యాంధృతో లీలయా
తేన త్వం దివి భూతలేచ సతతం గోవర్ధనోద్ధారకః
త్వాం త్రైలోక్యధరం వహామి కుచయో రగ్రే న తద్గణ్యతే
కింవా కేశవ భాషణేన బహునా! పుణ్యైర్యశో లభ్యతే.

ఈశ్లోకము ననుసరించి వ్రాయఁబడిన పద్య మీశతకమున 15-వ సంఖ్యలో నున్నది. ఇటులె కొన్నిపద్యములు భక్తిరసప్రతిపాదకములగు శ్లోకములకు ఛాయలుగా గానుపించుచున్నవి. ఇందలి ప్రతిపద్యము కదళీపాకములో సుకుమార