పుట:2015.333901.Kridabhimanamu.pdf/84

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములో లేక యాతని యనంతరము చాల గాలమునకు బుట్టియుండునని తలపవలసిఉన్నది" అని యొక యాక్షేపముగలదు. ఈ యాక్షేపమునకు లోకజ్ఞత చక్కగా సమాధానము నొసగగలద్. లోకమున విషయవసనల జయింపగలవా రేకాలమునగాని యసాధారణముగా నుందురు. లౌకికవిషయసముల్లాసముతొ నుండువారికి భోగవాంచలు పొంగారుచుండును. అయినను సర్వసౌభాగ్యములు కల్గియుండియు నందందు గొందఱు సువిరక్తులై, నిర్వికారులై, వీరవ్రతులై వెలయుచుందురు. సాధారణముగా ననేకులు స్వాంతము జిజ్జువాఱుచున్నను లోక నిందకు వెఱచియు, సంఘమర్యాదకు జంకియు, నింకను బలుబాధలకు భయపడియు సర్వర్తనమును సాగించుకొను చుందురు. అట్లు వారు పవిత్రవర్తనమును బడయుటగూడ నిజముగా భగవదనుగ్రహాయత్తమే. సన్నివ్?ఏశములు స్వాధీనములై దుష్ప్రవర్తనమునకు ద్రోవలోసంగుచున్నను,. జిత్తం చిదుకుచున్నను, జిత్రముగా నపాయముల కందక పవిత్రవర్ననమునే పడయ గల్గుచుంట భగవదనుగ్రహాయాత్తమే కాదా! రహస్యముగా దమవర్తన మెంతేని క్రుళ్ళువాఱి దుర్గదిలమైరోత గొల్పుచున్నను గొందఱు బాహిరముగా బరిశుద్దులువోలె శిష్టతను నటించ్దు శ్రీరంగనీరు లాడుచుందును. లోనెల్ల నపవిత్రతతో నిండియు