పుట:2015.333901.Kridabhimanamu.pdf/70

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దలచిన రోతవచ్చు నొకనాటిసుఖం బోకయేటిదు:ఖ మీ
పలైవలె వారకాంతల యువస్థలకుం బదివేల దండముల్ !
     ఈ పద్యము స్త్రీ వ్యాధిగ్రస్తుడై పలివెల వేశ్యలను స్త్రీనాధుడు చెప్పినదిగా బహుస్థలములండూ వినబడుచున్నది. పలివెల శృనాధునినాట వారకాంతలకు బ్రఖ్యాతి గన్నది. భీమఖండము (1-77) న
శా. కాంచీమౌక్తికతారాహారకటకగ్రైవేయభూషావశుల్
   లంచం బిత్తురు దూతికాతతికి లీలన్ బెండపూడన్ననిన్
   బంచాస్త్రోపము దార తార కఫయన్ బ్రార్ధించి లోలోపలన్
   జంచారామములందు బల్వెలపురిన్ బ్రౌఢేందుబిరిబాననల్.
అని పద్యము కలదు
సీ. నగము బోలెడుమేమ సగము చేసెను గదా
        భగము కా దది మహోరగము గాని
    ఇత్యాది సీసపద్యమును నర్సరావుపేటలో నొక
విద్వాంసులు శ్రీనాధుడు స్త్రీవ్యాధిగ్రస్తుడై చెప్పినది
యని చదువ వింటిని.
   శ్రీనాధుడు కర్ణాటరాజధాని యగువిద్యానగరమున కరిగినప్పుడు చెప్పినపద్య మిది సుప్రసిద్ధము:
శా. కుల్లా యుంచితి గోకమట్టితి మహాకూర్పానమున్ దొడ్గితిన్
     వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మనవితిన్ విశ్వ్ స్తవడ్డింపంగా
     జల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచుబోవాడితిన్
     దల్లీ ! కన్నడరాజ్యలక్ష్మిఎ ! దయలేదా నేను శ్రీనాధుడన్.
విశ్వస్తవడ్డింపు రుచింపలేదు!