పుట:2015.333901.Kridabhimanamu.pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఉ. గండము దప్పె నంధ్రకవిగానికి నిన్నటిరేయి పుష్పకో
   దండునికేళిఁ గూడకయ తద్దయు నిల్చితిఁ గాని యయ్యయో
   బండరువారి పాపికిని బైటిపసారెమె కాని యందులోఁ
   బుండట యెల్లవంకఁ జెడిపోదుఁగదా విషయింపఁ బోయినన్.

ఉ. జంగమురాలిఁ బట్టి యొకజంగము వంగఁగఁ బెట్టి యోనిలో
   లింగముఁ బెట్టి క్రుక్కి యదలించుచు నొక్కొకతాఁకు తాఁకినన్
   లింగ! నమశ్శివాయ! గురులింగ! మహేశ్వర! జంగమయ్య! యో
   యంగజభంగ! సాంబగురుఁడా! యనుఁ దాఁకినతాఁకుతాఁకుకున్.

ఉ. గోష్పదరూపమై మిగులఁ గోమలమై గణుతింపరానిదై
    శష్పవిహీనమై నునుపు చాలఁగఁ గల్గి ద్రవం బపారమై
    పుష్పిణి యైననీభగము పుణ్యమునన్ భుజియింపఁగల్గె వా
    స్తోష్పతికైన నో ద్రవిడసుందరి! నిన్ను వచింప శక్యమే?

చ. వడిసెల చేతఁ బూని బిగివట్రువగుబ్బలఁ బైఁట జాఱఁగా
   నడుము వడంకఁగాఁ బిఱుదు నాట్యము సల్పగఁ గొప్పువీడఁగా
   దుడదుడ మంచెయెక్కె నొకదొడ్డమిటారపుఁగమ్మకూతురున్
   దొడదొడ మంచమెక్కె నొకదొడ్డమిటారపు రెడ్డికూఁతురున్.

శా. అక్షయ్యం బగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
    భిక్షాదానము సేయురా సుకవిరాడ్ బృందారకశ్రేణికిన్
    దాక్షారామచళుక్య భీమవర గంధర్వాప్సరోభామినీ
   వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.

ఈ కడపటిపద్యము శ్రీనాథుఁడు తెలుంగురాయని దర్శించినప్పుడు చెప్పిన పద్యముగా సర్వాంధ్రదేశమందును