పుట:2015.333901.Kridabhimanamu.pdf/64

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలదు 'కవిరాజు ' గలడు. శ్రీనాధుడు రాజమహేంద్రవరమున గొన్నాళ్ళుండుట సుప్రసిద్ధము. అక్కడ జెప్పిన చాటుధార లింకను గలవు. నేను ప్రకటించిన చాటుపద్య మణిమంజరి 1, 2 భాగముల జూడదగును. శ్రీనాధునకు 'కవిరాజు ' అని బిరుదుపేరు గలదు. అది 'కవిరాజుకంకంబు గౌగిలించెను గదా ' అని శ్రీనాషుని యవసానకాలపధ్యము నను "ఘనుడైన శ్రీనాధకవి రాజరాజు" అని పల్నాటివీర చరిత్రమునను గలదు. రాజమహేంద్రవరవాస్త్యవ్యులు నేడు నొక కవిరాజుగారు గలరు. మున్నూఱేండ్లకుముందే యిది లక్షణగ్రంధములందు శ్రీనాధునిపేరనే యుదాహృతమయ్యె గాన వర్తమానకవిరాజుల కీపద్యపుముచ్చట వర్తిల్లదు. రాజమహేంద్రవర కవిరాజు వేఱొకడు ప్రాచీనుడు గానరాడు. ఈ పద్యమునుబట్టి శ్రీనాధునివర్తన మెట్టిదిగా తెలియనగునో తెలుపుటకు ప్రాజ్ఞలు ప్రమాణము. మఱియు గూచిమంచి తిమ్మకవి లక్షణసారసంగ్రహమున 'రంతు ' లను పదము సాధురేఫముగల దనుటకు శ్రీనాధుని చాటుధారగా నీక్రిందిపద్యము నుదాహరించెను.

ఉ. అంగడివీధి బల్లవుల కానగ మామిడిపండు లమ్ముచున్
    జంగమవారిప్;ఇన్నది నిసాళితనంబున జూచెబో నిశా
    తాంగజబాణకైరవ సితాంనుజమత్తచకోర బాల సా
   రంగజబాణకైరవ పితాంబుజమత్తరచకోర బాల సా
   రంగత????టిన్నికాయముల రంతులు నేసెడువాడిచూపులన్.