పుట:2015.333901.Kridabhimanamu.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రించును. శివరాత్రిమాహాత్మ్యమును జెప్పుపవిత్రగ్రంధమున సంస్కృతమూలమున లేని చండాలాంగనా బ్రాహ్మణబ్రువసంభోగసంభారము వంత సంపూర్ణముగా వర్ణించియే తీఱవలెనా? కాశేఖండమున ననుచితముగా గంచియఱవతల ముచ్చటను బచ్చిగా వర్ణీంచవలసినదే? హరవిలాసమున శివిలింగోత్పత్తి కధ నంతకంటే సభ్యముగా సాగింపదగదా ? సత్ప్రబంధములందే లేని అంకుగొంకు లింక రసికులకొఱకేరచితమయిన క్రీడాభిరమమునజూడబడునా ? అనావశ్యకము లయినపట్టుల గూడనిట్టి రచనములను హెచ్చుగా జేర్చుటను జేసియు, సరసమయిన శృంగారసందర్భములం దింపులు సొంపులు పొంపిరి వోవునట్లును క్షుద్రహృదయులు గూడ రసార్ద్రహృదయు లగునట్లును సమృతధారవంటి కవితాధార నలుగులు వాఱించుటంజేసియు, జాటుమాటు లేక తన స్వైరవిహారమును చటుధారలలో జాటుటంజేసియు, సర్వాంధ్రదేశమునందును, నందును బల్నాట స్థలనిర్దేశ నామనిర్డేశములతో గూడ్ నాతని స్త్రీలౌల్యప్రఖ్యాపకములయిన కధలు, పద్యములు గడల్కొనియుండుటంజేసియు, అవి యెల్ల నప్రామానికములని యడగద్రొక్కుటకు దగినవ్యతిరేకప్రమాణములు గానరాకపోవుటంజేసియు, శ్రీనాధకవీశ్వరుని గూర్చి నేను రచియించిన శృంగారశ్రీనాధమున మిక్కిలి జాగ్రత్త