పుట:2015.333901.Kridabhimanamu.pdf/298

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

                                           సైరికుడు 85
వ. అనుచుం గతిపయవదంబు లరుగ గట్టెదుర నొక
    చెట్ట(నట్టు?)పునికోడలు గోడలు నక్కి చూడబొడగని
   యమ్మచ్చెకంటిమున్ను దన్నెఱింగినది యగుట టిట్టిభున
   కెఱింగించి గొవిందమంచనశర్మ యిట్లనియె 259
క. వ్ర్రాలె నరవిందలోచన
    పాలిండులు చూడజూడ బ్రసవాంత్యమునన్
    ఏలా యీమాటలపని /
   వ్రాలుట చోధ్యంబె చక్రవాకులకొదమల్ ? 260

వ.అనుచుం జనునప్పుడు ముందట నొక సైరికునింగని టిట్టిభునకుం
జూపి యిట్లనియె. 261
                            సైరికుడు
గీ. మాఘమాసంబు పులివలె మలయుచుండ
   బచ్చడం బమ్ముకొన్నాడు పణముర్మురములు
   చలికి నొఱగోయ కే లుండు సైరికుండు 262
                              (గ్రంధపాతమా?)
ఉ.దిక్కరికుంభకూటముల
           దీకొనుచన్నులు, కాముతేరివై


  • వనరమునకు అనియుందునేమో.