పుట:2015.333901.Kridabhimanamu.pdf/290

ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                    మధుమావతియిల్లు 77

హా ! ఖగేందంబులార కయ్యమున నీల్గి
పోవుచున్నారె దేవతాభువజ్నమునకు
మీరు రంభాతలోత్తమామేనకాది
బోగకార్యాద్ర్హమై కోడిపుంజులార. 236
వ. అని యట పోవుచు నాదక్షిణంబున పైడికుండల
   మొగసాలతోడిది మాధవశర్మకూతురుమధుమావతిదేవి
   మందిరంబు 237

                        మధుమావతియిల్లు
గీ. సింహళద్వీపమున గాని సృష్టిలోన
   బద్మినీజాతి లే దనుపలుకు కల్ల
   తెఱవ మధుమవతీదేవి దేవకన్య
   పద్మినీజాతి దోర్గంటిపట్టణమున. 238
చ. మలయజగంధి యైనమధు
            మావతియూర్పులకమ్మదావి చెం
   గలువల సౌరభంబునకు
           గాదిలిచుట్తము చక్రవాకులం
  గలకల నవ్వు దానిచను
          కట్టు తదీయవిశాలనేత్రముల్
  తొలకరిక్రొమ్మెఱుంగునయి
           దోడులు మిడలు గండుమీలకున్ 239