పుట:2015.333901.Kridabhimanamu.pdf/284

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నడ్డంబు ద్రికటంబు నై యురస్ స్థలమున
        గంధసారస్థాపకమ్లు మెఱయ
జాల నిగ్గులు గుల్కుపాలఱెక్కలకుచ్చు
      నామకర్ణంబుతో నక్కళింప
బెనచి వెండుకలతో బెనవెట్టి చుట్టిన
       ప్రాతచెంద్రికవన్నెసాగ యమర
జనిదంబుగ బెనుబాము సనదరించి
యం ఘ్రికటకంబు ఘల్లుఘ ల్లనుచు మొరయ
నాహితుండికగరలవిద్యాధిరాజు
వచ్చె బాములమెంగడు వదరులాడు 223
సీ. పూత్కారపవనంబు పూరించుపుక్కిళ్ళు
          ముసిడిపండులతోడ ముద్దు గురియ
    నందిటిసంకుపూసలసద్ధు కతు తుంబి
        నాదస్వరోజ్జృంభణముల నడప
   నేడురంధ్రమ్ములు నిరుగేల వ్రేళ్ళను
        వివృతిసంవృతిలీల విస్తరింప
  నాలాపతాళాంతరాంతరంబులయందు
       వి క్కనుశబ్దముల్ చొక్కటముగ
 నాగసింధుప్రభేదనానావరాట
రాగగంధర్వలహరికారంభణముల
మిహిపదంబుగ బాములమెంగ డూడె
భోగిరాజులు నర్తింప నాగసారము. 224