పుట:2015.333901.Kridabhimanamu.pdf/23

ఈ పుట ఆమోదించబడ్డది

తొలుదొలుత గ్రీడాభిరామ తాళపత్రపుస్తకమును దెఱచి నేనీపద్యమును జదువుచునే యిది శ్రీనాధ గ్రంధమగునో యని యనుమానించితిని. ఈ పద్యమందు శ్రీనాధుని యపూర్వరచనరీతియగపడవలెను. కాశీఖండ షష్టాశ్వాసమున నొక సీసపద్యపుటెత్తుగీతి (6-46) యీ విధముననే కలదు. సీసము నాల్గుచరణములను గ్రియాన్వితము లగువాక్యములగా జెప్పి యెత్తుగీతిని యత్తదర్ధకశబ్ధములతో నుపక్రమించి పూర్వచరణములతో నవ్యయము పొసగించుట శ్రీనాధుని క్రొత్త గడుద్స్రికూర్పునేర్పు. మఱియు బై యెత్తుగీతికలో 'దాశరధికి ' అను షష్ట్యంతవిశేష్యమునకు విశేషణము లయిన 'తాటకా కాళరాత్రికి ' 'కాలకంధరకొదండఖండనునకు " అను పదములుగూడ షష్టివిభక్తిలోనే కలవు. సాధారణముగా దెలుగుకవులు విశేషణములను బ్రధమాంతముల గా నుంచి, 'అగు ' క్రియాజన్యవిశేషణమును జేర్చి విశేష్యముతొ బొందింతుదు. 'తాటకాకాళరాత్రియు, కాలకంధరకోదండఖండనుడు నగు దాశరదికి ' ఇత్యాదివిధమున. శ్రీనాధుడు తఱచుగా విశేషమువిశేష్యముల నేకవిభక్తిలోనే నిలుపుచుండును. 'భువనైకధన్విచే బుష్పాయుధినిచేత ' - కాశీఖండము (4-203). 'హాటకగర్భుచేత గమలాసనుచే ' ఇత్యాది - శృంగార నైషధము (1-3).

పయి సీసగీతియందుంబోలె షష్ఠీవిభక్తి కాశీఖండమున సీసగీతియందును----