పుట:2015.333901.Kridabhimanamu.pdf/218

ఈ పుట ఆమోదించబడ్డది

 
                                             కృతికర్త వంసవర్ణన 7
సీ. సత్యప్రతాచారసత్కీర్తిగరిమల
            జంద్రుతోడను హరశ్చంద్రుతోడ
   నభిమానవిస్పూర్తి నైశ్వర్యమహిమల
           రారాజుతోడ రైరాజుతోడ
  సౌభాగ్యవై భవజ్ఞానసంపన్నత
           మారుతోడ సనత్కుమారుతోడ
  లాలిత్యనిరుపమశ్లాఘావిభూతుల
        భద్రుతోడను రామభద్రుతోడ
  బాటి యనదగు ధారుణీపాలసభల
  నీరహరిహర్4అరాయపృధ్వీక్శత్ర
  రత్నభండారసాధికారప్రగల్బు
  మల్లికార్జును త్రిపురారి మంత్రివరుని 17

మ. కపటాచారవిరోధిరాజసచిన
                గ్రావోగ్రదంభోళికిన్
    నృపనీతివ్యవహారకార్యఘటనా
                నిర్ధారణాశాలికిన్
   దపనీయాచలరాజదైర్యనిధికిం
                 ధర్మైకపాధోదికిం
   ద్రిపురారాతిమహాప్రధానునకు నే
                 రీ యుద్దు లిద్దారుణిన్ 18