పుట:2015.333901.Kridabhimanamu.pdf/152

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శక్తిస్వరూపిణి యని కలదు గదా. వీనివలన గాకతి యనునది దుర్గ కపరనామ ధేయ మనియు, నామెయే కాకతీయుల కులదేవత యనియు స్పష్టము. మఱి కూష్మాండ వల్లరినుంది కాకతీయు లుద్భవించి రను శాసనభాగమును బరిశీలింప నది స్థానికగాధలపై నాధారపడి యున్నట్లు తోచుచున్నది. మాధవవర్మకుమారుడు పద్మసేనుడు సంతానంబు లేమి బుధామమతంబున సిద్ధేశ్వర శ్రీమన్మహాదేవుని నిత్యంబును గూష్మాండఫలంబుల బూజింప దత్ప్ససాదంబున నొక్క సుతుడు గలిగెనని ప్రతాపచరితాదులగలదు. ఇదియే కూష్మాండవల్లరీగాధకు మూఅ మని తొచును. పైవిషయముల బరిశీలింప గాకతి జైనదేవత యనుటకు దగిన యాధారములు తగిన యాధారములు లేవు. అవి దొరకువఱకు నామె దుర్గయే యనియు, నామెను భజించుటచే గాకతీయుల కాపేరు గలిగె ననియు మన మూహింపవలసియున్నది. కాగతి యనుగ్రామమునుండి కాకతిశబ్దము పుట్టినదనియు గొందఱు వ్రాయిచున్నారు. అది సరికాదని తోచుచున్నది. నామిత్రులలో నొకరు భౌద్దవాజ్మయమున గాకతి యను దేవత యున్నదని తెల్పియున్నారు. ఇదియు భావివిర్శనమువలన దేలవసియున్నది. ప్రోలరాజు జైను డగుటచే గాకతియు జైనదేవతయై యుండు నని విల్సనుగా రభిప్రాయపడియున్నారు.