పుట:2015.333901.Kridabhimanamu.pdf/144

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తునుకలై యున్న మాతృక నెట్టేట్టో పొందించుకొని లుప్తభారములను, సాధుపాఠములను సేకరించుకొని వచ్చితిని. ఈ తూరి మరల నెవ్వడేని యీప్రతి నెత్తుకొనిపోయెనా యింక దురుద్ధరమే క్రీడాభిరామము ! ప్రత్యంతర మింక లేదు! సాధుపాకసంపాదన మిక శక్యము గాదు ! దేశ చరిత్ర, సంఘచరిత్ర, బాషాచ్రిత్రాదులను బరిశీలించువాడికి బహూపకారకమయినది. శ్రీనాధరచితమయినది. ప్రశస్త రచనము గలది యన్న యభిమానముచేతనే దీని నిప్పుడిట్లు సంస్కరించి మరల బ్రకటించుట. అంతేకాని దీనిలోని రోత విషయములమీది ప్రీతిచేతగాదు. పామరుల కందకుండ బండితులకే విక్రయింతు మని ప్రకటకులు బాసచేసిరి గావునను, గుప్తపఱచుట వ్యాప్తి నధికపఱచును గావునను యధావస్థితముగా ముద్రించుటే మంచిదని పలువురు ప్ర్రాజ్ఞలభిప్రాయపడిరి గావునను దీనిని వికారపఱు;అక యున్న దున్నట్లు ముద్రించితిని. ఈ పీఠికలోగూడ దుచ్చములయి నను గొన్ని శ్రీనాధరచనములను దచ్చరిత్రప్రయోజనములను బట్టి, కవితాచమత్కృతి మీది యాదరమును బట్టి చేర్చితిని. శ్రీనాధకవిసార్వభౌముని రచన లేవియు జెడిపోకుండ నెలకొనియుండుగాక యనియే నా కోరిక. ఆ కవి యంత యభ్యర్హితుడు. ప్రఖ్య్హాతాంధ్రవిద్వాంస్లతో బలువురతో యోజించి యీగ్రంధ మిట్లు ముద్రితమగుట