పుట:2015.333901.Kridabhimanamu.pdf/120

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శిలాశాసనమున నామె నృత్యము చేయుచున్నట్టు విగ్రహ చిత్రముగూడగలదు+.ఆమె భాగ్యసంపన్నురాలు, ప్రఖ్యాత నర్తకి, విజయవాటీనివాసిని. కావున నిట్టియామెను శ్రీనాధ కవిసార్వభౌము డెఱిగుండును. మనకధాపాత్రములు మాచల్దేవియిల్లుదాటి యట కొంత చని యింకొక వేశ్య యింట ముకురదీక్షోత్సవమును జూచిరి. 'ముకురవీక్షావిధానంబు మొదలు లేక, వెలపడంతికి గారాదు విటుని గనయ" నట! మదనరేఖ యనునావారకన్య కీమంచెనశర్మ తండ్రి ఈతడే యాముకురదీక్షను జరపెను. 'శ్రీవర్ధన్వ ' మను మంత్రమును జెప్పి యాబాలిక నాశీర్వదించెను. ద్విజేతరుల నాశీర్వదించునప్పుడు నేడును "శ్రీవర్ధన్వ" మని యారంభము గల సంస్కృమంత్రమును బ్రాహ్మణులు పఠింతురు. పై వేశ్య యింట గధాప్రసంగమున మనకధాపాత్ర మగుమంచెశర్మ శ్రీకాకుళాంధ్రనాయకస్వామికి వైశాఖపూర్ణీమనాడు జరగు దవనోత్సవము* నాటి శృంగారవిహారవిశేషముల జెప్పినాడు. దానిలోని సారాంశములు: శ్రీకాకుళేశ్వరస్వామి నాగదేవభట్టారకునింట కాకరపాదులో వెలసినాడు. నసిండి కొరను వేడిపా లారగించినాడు. విప్రకన్యను బొందినాడు (ఇది శ్రీకాకుళక్షెత్రమహాత్మ్యకధలో నున్నది). శ్రీకాకుళ పుణ్యక్షేత్రము పండ్రెండుక్రోశముల చుట్టుకొలత గలది.


+ చూ.చిత్రపటము. *చూ. అనుబంధము