ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

వనతరువాటికామృదుల పల్లవపాళుల సంజకెంజిగుల్
 సన, నిను వేచుచుంటిని విచారశరాకులితాత్మతన్ సుధా
 జనక మనోహరస్మితము చల్లెడునీరు చిరా స్యంబింబముం
 గన గుతుకంబునం జెలగు కన్నులనించుక యప్పళించుచున్

    వనతరుచ్చాయల వనధరచ్చాయల
       నంధకారము సాంద్రమగుచు నెఱయు,
   మార్గమ్ముగానక దుర్గమారణ్యాని
      బేడత్రోవ వట్టితో ప్రియతనూజ
  గిరికహ్వరంబుల హరిపుండరీకాది
     మృగ గర్జలకు జితమెట్లడరెనొ
పర్వ తాగ్రమునుండి పర్వెడు సెలెయేళ్ళ
    వఱ్ఱువాగులదాట వలనుపడెనె?

నదిని పెడిఫోవువానికి నానయటుల
 బూర్వసుకృత విశేష సంభూతిచేత,
 భవ్యుం డీతడు దైవంబుపగిది వచ్చి
 నిన్ను రక్షించినను జేర్చ్రె గన్నతల్లి.