ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

అసితసూత్రంబులంగూర్చి బసలుగుల్కు
మంచి ముత్యాల సరములు మదికివచ్చు
గన్యకా చూర్ణకుంతలాగ్రములనుండి
తొలకువర్షాంబుబిందుల చెలువుగనంగ.

వానజల్లుల వలువలు మేను దడిసి
నీరుచిల్కు నొయారంపు నీరజాక్షి
తియ్యదనేల సోనల దిరుగుచున్న
చైత్రమాసపు వనలక్ష్మి సౌరుగేరు!

అని యిటు మెచ్చుచుండ నతం డంగనలో దలపోయ నీతండీ
వనముల కెలవచ్చె గరవాలమదేటికి, నెత్తురేమి, నా
యస యటువంటి వారె ధరయందు వసింతురటంచు నెంతునీ
మనుజుని దేహసౌష్టవసముచితరూపము తండ్రికున్నదే!

ఫాలతలమున ముడుతలు పడుటలేమి
దీనభావమ్ము మోమున నూనుకొనమి
వెంట్రుకలు పండినొసటిపై వ్రేలలేమి
నెసగునాకృతి భేదమ్ము లిరువురందు.