ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి

అడుగడుగున కొక యాపద
జడియక తప్పించుకొనుచు శాతోదరి పెం
జడినుబ్బి పాఱువాగుల
గడుచుచు మలదాటి, యలసి, క్షణమటునిలువన్.

జలదము జీల్చికొంచు నొకచంచల చంచదుదారకాంతి ది
క్తలములవ్రేలు సంతమస కాండములం దొలగింప జెంగటన్
జలజవిశాల నేత్రగనె జారుశరీరు వికీర్ణకేశు ను
జ్జ్వల రుధిరాంక చేలు గటిబంధనివిష్టనిశాత ఖడ్గునిన్.