ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

శాంతనిశ్శబ్దతాలక్ష్మిసంతసమున
 గిరివనాంతర సామ్రాజ్యభరము మోచి
 సకల జీవసుఖస్ఫూర్తి సలుపుచుండె
 జీమచిలుకని యన్నను శిక్షగలదు.

  సంజ కెంజాయలుడుగుట, సంతమసము
  లలమికొనుటయు బక్షుల కలకలములు
  శీతలానిల సంస్పర్శ శిశిరకరుని
  రాకపోకలు నెఱుగ దారమణి యపుడు.

  బాననారూఢ మిధ్యా ప్రపంచమందు
   సంచరించుచుండె నాచానమనము;
   బాహ్యవ్చిషయాను భూతికి బాహ్యయౌట
   వానమబ్బులు గ్రమ్ముట గానకుండె

అరరె యిదేమి చిత్రమొ వియత్తల మంతయు నీల నీరదా
కరమయి తారకానికర కాంతుల సైతముగొలు పోయి శ
ర్వరిని మఱింత సాధ్వసకరంబుగ జేసే;
                                 బృషన్ని కాయము
తఱచుగరాలు చుంచెను గులాయములన్
                               ఖగముల్ నణంక గన్