ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

నట్టియానందమింకనాకెట్టు లబ్బు
గలలనై నను గొండల గాననమీ
బూవుబొదరిండ్ల సెలయేండ్ల బుష్కరముల
దలుగు సమయంబు తలపనే తలపనైతి.

కొండనెత్తమ్ముల గోరాడుమబ్బుల
    గమనసౌందర్యంబు గాంచికాంచి;
మేఘోదయంబున మిసమిసపురివిచ్చి
   యాడునమ్ముల యెప్పు లగిసియరసి,
యమృతధారలరీతి నచ్చమై ప్రవహించు
   సెలయేళ్ళలో గ్రీడ సలిపిసలిపి;
ప్రకృతిమంజులమైన పక్షులగానంబు
   దమెదీఱ వీనుల ద్రావిత్రావి;

యెండవేళల బూబొదరిండ్లదూరి
  హరిణగర్భినులకు జివురాకు లొసంగి
  ప్రసవమాలల ధరియించి ప్రతిదినంబు
  గాననంబున రాణనై క్రాలుచుంటి.