ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి ---

మునుదామందనునదలిన
ఘనమగునెత్తంబు లేరి కలయం బరికిం
చిన నొక్క గొఱ్ఱెయేనియు
గను పట్టకయున్న నబలకా తరమతియై

కొలకుల గోనలన్ గుహల గ్రూరమృగాకుల కాననంబులన్
బొలతుక చూచిచూచి యెటుపోయిన పోబడిగాంచలేక బె
గ్గిలి నయనాంచలాశ్రువులు గీటుచు నేమియు దోచక చ్చటం
గలవెలిఱాల పేటుపయి గంపితమై మెయిమోహిచింతిలున్
ఎచ్చటకేగెనో తెలియదియ్యెడ గొఱ్ఱెలమంద యింక నే
 నెచ్చటజూతు జూడగలవెల్లను జూచితి గంటకాశ్మముల్
పచ్చికనుండగానకయ పాదమునెట్టిన గాయమాయె మై
హెచ్చెగతిప్రయాస, మికనేగతి బోగలదాన నింతికిన్

జనకుడు నాదురాకకయి సాంధ్యరుచుల్ విలసిల్లినంత ద్రో
వను దిలకించుచుండును గృపామయ భాష్పజలార్ద్ర దృష్టులన్;
మనమున జింతనొందదొకొమందలు లోయలునట్టి పోయెనం
చని వచియించినంత; నెటులాయన మోముగనంగ జాలుదున్.