ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

జొన్నపాడుచేయు దున్నల్స బందుల
దోలితోలి కొంతసోలి, రాత్రి
నిదురవోయి లేచి నిదురమత్తున మాది
గ చినవాని చేని కంచెదాటి.

నేనటు కంకులు గోయగ
మానసమున దట్టెనదియు మాదిగచేనం
చోనలినాక్షిరొ,యంతట
మానితి గంకులను విఱువ; మడివీడి వెనకొ.

వచ్చితి; నని చెప్పుచు నే
దెచ్చిన కంకులను జూడు తల్లగ ముత్యా
లచ్చొత్తినట్లు సొంపగు;
గిచ్చిన బాల్గారుననుచు గెలన నిలువగెన్

అంత బెంచలరెడ్డి యిట్లనియె:

గొప్పవారికైన జొప్పడు బొరపాటు
ఇదియె తప్పుగాగ నెంచదగదు;
బుద్ధిదెలిసి యొనడు పొనరుచు శౌర్యంబు
నట్టివాడ శిక్షకర్హు డిలను.