ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

మాలమాదిగలవారల మందమతుల
గష్టపెట్టిన మనకేమి గలుగు సుఖము?
సర్వజనులను బాలించు జగధీశు
డరయుచుండనె సకలాంతరాత్మ యగుచు

ఇప్పుడైనను రేపైనను నెప్పుడైన
ననుభవింపక తీరునే యఖిలకర్మ
ఫలము? లటుగాన జనులకు భద్రమగును
న్యాయ్య మార్గంబు దప్పక నడచుకొనుట.

సుతుడైనను హితుడైనను
సతియైనను నల్లుడైన సదముల ధర్మ
వ్యతిరేకత వర్తించిన
మతిమంతులు వారి పొత్తుమానుదురు ధనన్

పెంచెలరెడ్డి యల్లుండట! పెంపఱి మాదిగ జొన్నచేనిలో
గొందెపు బుద్దిగంకులను గోసినాడట! యంచు నూరివా
రెంచరె? దుర్యశంబు నిపు డెవ్విధి బోకడవెట్టనౌను; నే
మచితనంబుబూన నిక మానముదక్కునె! కీర్తినిల్చునే?