ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

కలుగునో కల్గనో సుతుడు గిన్నులకామెతగాగ, పాలడాల్
గులికెడు లేతబుగ్గలను గూరిమి ముద్దిడు భాగ్యమబ్బదో!
యిల సుతహీనయైన సతి కేమిసుఖంబగు? భోగభాగ్యముల్
దలకొనియున్ వృధాగద సుధాకరహీన నిశా విధంబుగన్

   అని యిటుల దలపోయుచు దు:ఖాక్రాంతమానసయై

కలువలజంటనుండి దొనకన్ దిగజాఱెడు కమ్మనీటికా
ల్వలవలె భాష్పపూరములు పైకొని లోలదృగంచలంబులం
దొలకి పయోధరాగ్రములతో నెకసెక్కెములాడుభంగి, న
ప్పొలతుక వెక్కియేడ్చె నిజపూర్వకృతాఘ నిదాఘత్స ప్తయై

అంత బొలంబెల్ల గలియంగ్రుమ్మరి యస్సురనుచు నాహలికుండు

   పటు సూర్యాతప సంహతి
   నిటాలున ఘర్మబిందునికరమొలయ, నా
   కటితో జని యింటికి బ్ర
   స్ఫుట దు:ఖనివర్ణవదన సుదతిని గాంచెన్