ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

నను నొంప నీ యభీష్టం
 బని తలచెదవేని నేడె యా నరవాసం
 బునకు ననుం గొనిపొమ్మా
 యన నచ్చెలి, కాంతుడనియె నాశ్చర్యమునన్

ప్రాణసమాన, నీదయినభావము నేనెఱుగంగ జాలమిం
 బోణిమి దక్కి పల్కితిని,భూరిసుఖంబులు రాజ్యమేని త్వ
 త్ర్పాణ సురక్షణార్దమయివాయుదు, నీకొకకీడు సల్ప హృ
 త్కోణమునం దలంచెదనె? క్రూరుడనెయిటు కష్టవెట్టగన్.

అదియేమో నినుగాంచ నాతలపులత్యంతంబు బ్రేమాంకు రా
 స్పదమై పూర్వముచెల్శి యున్నటుల జెప్ప న్రానియిచ్చాలతల్
 మదిలో నల్గడనల్లువాఱె; నికనిర్మానుష్యమౌ కాన నో
 సుదతీ, యొంటిగనిన్నువీడి చని యెచ్చోనైన జీవింతునే

అనవినిచాన, లోలనురియాడెడు రాగరసప్రవాహ వీ
 చినిబిడ శీకరప్రగతి చిప్పిలెనో లనుదమ్ములందు నా
 దొనకెడు సమ్మదాశ్రువులు దూలగ బయ్యెదనద్దికొంచు ని
 ట్లనియె నవీనవాంచలుహృదంతరమందు ఖదంబు ద్రొక్కగన్.