ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

ప్రతిరోధము దొలంగిన యా
 యతివ హృదంతరము మెత్తనయి పోవంగా
 ధృతిలెనిలేత కొమ్మన,
 నతడెమ్మయి ద్రిప్పివంచు నట్టులె నంగున్

లేవలేక లేచి కడకా లేమబుంగ
 జంక నిడికొని మలయూట చక్కి కరిగె;
 ఏమెచేయుచు నున్నదో యెఱుగ రిపుడు;
 యంత్ర పాంచాలికవిధాన నడుగులిడును.

చూపుమేరకు నెచ్చెలి జూచిచూచి
 యూటకాలువ దరిజేరియుండు ననుచు
 వేగిరము ప్రేత సంస్కార విధులుజరిపె
 రాజపుత్రుండు విరిబోణి రాకమున్నె.